ఒడిశాలోని జాజ్ పూర్లోని పుబోల ముందాసాహి అనే గ్రామంలో దారుణం జరిగింది. రాజు చాంపియా,కుని భార్యభర్తలు. శుక్రవారం దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో కుని భర్త రాజు నిద్రలో ఉండగా అతని పురుషాంగాన్ని కోసి హత్య చేసింది. తర్వాత శవాన్ని కాలువలో వేయగా స్థానికులు గుర్తించారు. పోలీసుల విచారణలో అసలు నిజం తెలియడంతో కునిని అరెస్ట్ చేశారు. కోపంలో చేశానని, కావాలని చేయలేదని ఆమె పోలీసులకు తెలిపింది.