చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలోని ఓదులపేటలో విచ్చలవిడిగా చింత చెట్లు నరికివేస్తున్నారు. చారాల పంచాయతీ ఓదులపేట ఎస్సీ కాలనీ వద్ద నాలుగు పెద్ద చింతచెట్లను నరికి పోగులు వేశారు. యంత్రాల సాయంతో రాత్రికి రాత్రే వందల ఏళ్లనాటి చెట్లను కూడా నరికేస్తున్నారు. లారీల్లో దుంగలు తరలిస్తున్నా ఎవరూ అడగడం లేదు. గ్రామ వీఆర్వోని వివరణ కోరితే, తమ దృష్టికే రాలేదని, వస్తే పరిశీలిస్తామని చెప్పడం విశేషం.