వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అదరగొట్టాడు. ఒకే ఓవర్ లో 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168 రన్స్ చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ 1, అశ్విన్ 3, హర్షల్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ ప్రస్తుతం 58 రన్స్ కి 3 వికెట్లు కోల్పోయింది.