పెద్ద సింక్ హోల్ నుండి ఒక వ్యక్తి తన బైక్ తో బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఓ యువకుడు బైక్ తో సహా పడిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. దీంతో యూపీలో రోడ్ల పరిస్థితిపై విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని రోడ్ల వాస్తవ పరిస్థితి ఇది అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.