విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ జెఏసి రాష్ట్ర కార్యదర్శిగా విశాఖ నగరానికి చెందిన డాక్టర్ హనుమంతు లక్ష్మణరావునియమి తులయ్యా రు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన బీసీ వెల్ఫేర్ జెఏసి రాష్ట్ర సదస్సులో ఏపి ప్రభుత్వ గౌరవ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బీసీ వెల్ఫేర్ జెఏసి రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషులచే డాక్టర్ లక్ష్మణరావు నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. దీనిలో భాగంగానే ఆయా బీసీ కులాల జనాభా ప్రాతిపదికిన 50కి పైగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. బీసీల అభివృద్ధి కోసం భవిష్యత్ లో మరిన్ని వినూత్న పథకాలు ప్రవేశ పెడతామన్నారు.
బీసీ వెల్ఫేర్ జెఏసి రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు మాట్లాడుతూ బీసీలకు చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, బీసీ జనగణన చేపట్టాలని కోరారు. పదోన్నతుల్లో బీసీ ఉద్యోగు లకు తగిన ప్రాధాన్యత కల్పిoచాలన్నా రు. కొన్ని కులాలకు పెండింగ్ లో ఉన్న ఓబీసీ జాబితాలో చేర్పులు చేయాలన్నారు. బీసీల ప్రగతితోనే దేశం మరింత వికాసం చెందుతుందన్నారు. బీసీ వెల్ఫేర్ జెఏసి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ హనుమం తు లక్ష్మణరావు మాట్లాడుతూ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బీసీల సంపూర్ణ ప్రగతికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఎంఎల్సి జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, వివిధ కుల సంఘా ల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.