ఉదార స్వభావానికి, త్యాగానికి, సమాజ సేవకు ఆదర్శం విజయ నగరం రాజవంశీయుల సొంతమని, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా నిత్యం తపించే మంచి మనసున్న మహారాజులు పూసపాటి గజపతి రాజులు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు.
విజయనగరంలో ఉన్న మహారాజా ఆసుపత్రి పేరు మార్చాలన్న ఆలోచన జగన్ రెడ్డికి ఎందుకొచ్చిందో అర్ధం కాలేదని గంటా నూకరాజు అన్నారు. రాజవంశీయుల వ్యవస్థ పోయి ప్రజా స్వామ్యం అమలులోకి వచ్చిన తరువాత పూసపాటి గజపతి రాజు వంశీయుల పేరుమీద ఉన్న వేల ఎకరాలను ప్రజలకు దారాదత్తం చేసిన చరిత్ర జగన్ రెడ్డి తెలుసుకోవాలని అన్నారు. ఉత్తరాంద్రకే పేరు గాంచిన ఆంధ్రా యూనివర్సిటీకి 600 ఎకరాలు ఇచ్చిన సంగతి, కోరుకొండ సైనిక్ స్కూల్ కి 1200 ఎకరాలు దానం చేసిన సంగతి, అదేవిధంగా ఎన్నో దేవాలయాలు, మరెన్నో ఆశ్రమాలకు వారి ఆస్తినంతా ప్రజలకోసం దారాదత్తం చేసిన సంగతి తెలుసుకోవాలని అన్నారు. 108 దేవాలయాలకు ఆణువంశిక ధర్మకర్తలుగా వ్యవహారిస్తున్నారంటే అది పూసపాటి వంశీయుల గొప్పతనమని గంటా నూకరాజు అన్నారు. ప్రజా ఆరోగ్యానికి రక్షణగా ఉండాలనే శంకల్పముతో విజయనగరంలో మహారాజా పేరు మీద ఆసుపత్రి ఏర్పాటు చేసి రోజుకు కొన్ని వందలమందికి మెరుగైన వైద్యం అందిస్తున్న ఆసుపత్రి పేరు మార్చాలన్న దుర్బుద్ది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకొచ్చిందని నిలదీశారు. పేర్లు మార్చడం, కూల్చడం తప్పా మరేమి చేతకాని మీకు రాజ వంశీయుల గొప్పతనం గురించి ఏమి తెలుస్తుందని గంటా నూకరాజు ఘాటుగా ప్రశ్నించారు.
సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా ఉన్న పూసపాటి అశోకగజపతి రాజుని తొలగించే ప్రయత్నం చేసారు, హైకోర్టు మొట్టికాయలు వేయడంతో తలదించుకొనే పరిస్థితికి వచ్చారు. మొన్న ఎన్టీఆర్ వైద్య కళాశాల పేరును మార్చే ప్రయత్నం, నేడు మహారాజా ఆసుపత్రి పేరు మార్చే ప్రయత్నం. ఇది తప్పా ఈ మూడున్నర సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమి లేదని అన్నారు. అదీకాకా రాజదాని అమరావతిని కాకుండా మూడు రాజదానులు అంటూ ప్రజలను గంధరగోళానికి గురిచేస్తూ, ప్రాంతాలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమా.? అని గంటా నూకరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరు మారాలని, వ్యవస్థలను, సంస్థలను నాశనం చేసేవిధంగా ఉండకూడదని హితవు పలికారు.