విశాఖపట్నం, మునగపాక: మండలం ఒంపోలు సచివాలయం ఒంపోలు గ్రామంలో నూతనంగా నిర్మించబడిన రైతు భరోసా కేంద్రాన్ని శాసనసభ్యులు యు. వి రమణమూర్తి రాజు (కన్నబాబు) గురువారం ప్రారంభించారు. అనంతరo ఎమ్మెల్యే మరియు మాజీ డిసిసిబి చైర్మన్ యు. సుకుమార్ వర్మ (తేజ) గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ జగనన్న మూడేళ్ల పాలనలో వారి కుటుంబాలకు అందిన లబ్ధి గురించి వివరిస్తూ గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ వెంటనే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న యాదవ కులస్తులు శ్రీకృష్ణుడి గుడి పునర్నిర్మాణానికి ఎమ్మెల్యేని కోరగా తక్షణమే తన సొంత నిధులతో లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మల్ల జయలక్ష్మి, జడ్పిటిసి పెంటకోట స్వామి సత్యనారాయణ, మండల కన్వీనర్ ఆడారి. అచ్చయ్య నాయుడు, సర్పంచులు, స్థానిక వైసిపి నాయకులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.