రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం చోడవరం మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చోడవరం మండలం గంగవరంలో ఈ ర్యాలీనీ వైసీపీ జెండా ఊపి ప్రారంభించారు. గంధవరం నుంచి ముద్దుర్తి జంక్షన్ మీదుగా వెంకన్నపాలెం గోవాడ , అంబెర్ పురం, గజపతినగరం జంక్షన్ మీదుగా చోడవరం చేరుకొని డిగ్రీ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కొత్తూరు జంక్షన్ లో మానవహారం నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ మాట్లాడుతూ, వెనుకబడ్డ ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖ జిల్లా అభివృద్ధికి వికేంద్రీకరణ విశాఖ రాజధాని ఎంత అవసరమని చెప్పారు ఆ దిశగా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.