కోడూరు మండలంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు వీల్లేదు అంటూ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మచిలీపట్టణం మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ బద్దంగా తమకున్న నిరసన తెలిపే హక్కును పోలీస్ యాక్ట్ పేరుతో నిరోధించడం సరి కాదని ఆయన అన్నారు.