గ్రామ పంచాయతీలలో నిధులు ఖర్చులు, వ్యయంపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. చనుబండ చెత్త సంపద తయారీ కేంద్రంలో పని చేసిన వారికి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకపోవడంతో వారు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రతి పంచాయతీలో నిధులు ఎలా ఖర్చు చేశారనే దానిపై లెక్కలు చూడాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.