మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది. ఎగురున్న జూరాల ప్రాజెక్టు నుండి భారీగా నీరు విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి ఎగువ నుండి వరద నీరు ఇన్ ఫ్లో 3, 60, 800 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో ప్రాజెక్టు నేటి ఉదయం నుండి 10 గేట్లు పైకి ఎత్తి 3, 85, 800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదుల్తున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884. 90 అడుగులు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి అవుతుంది.