హిందూపురం పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు, ఎగువ ఉన్న కర్నాటక ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో కొట్నురు చెరువుకు వరద నీరు భారీగా పెరిగింది. దీంతో పాటు సూరప్పకుంట చెరువుకు వరద నీరు రావడంతో రహమత్ పురం, ఆర్టీసీ కాలనీ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పట్టణ సమీపంలో ఉన్న పెన్ననదితో పాటు పరిగి మండల పరిధిలో ఉన్న జయమంగళి నదులకు నీటి ప్రవాహం మళ్లీ పుంజుకుంది. నీటి వద్దకు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.