తాగునీరు వృధా చేయకుండా అవ సరం మేరకు పట్టుకుని వాడుకోవా లని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రజలకు సూచించారు. శుక్రవారం గుంతకల్లు పట్టణంలోని 2వ వార్డు బిటి. పక్కీరప్ప కాలనీ, 19 వ వార్డు సత్యనారాయణ పేట కాలనీ లలో కార్మికుల చేస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అదే సమయంలో బిటి. పక్కీరప్ప కాలనీ లో కుళాయిలకు తాగునీరు వస్తుం డగా ప్రజలు వైపుల ద్వారా పట్టు కోవడాన్ని గమనించి నీరు వృధా చేయకుండా అవసరం మెరుకు పట్టుకుని కుళాయిలను కట్టి వేయాలని సూచించారు. అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కుని స్వచ్ఛ గుంతకల్లుకు సహకరిం చాలని మహిళలకు సూచించారు. ఆయనతో పాటు శానిటేషన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.