పార్కు చేసిన ఒక ద్విచక్ర వాహనంలో దూరి నాగుపాము ఏకంగా స్థావరం ఏర్పాటు చేసుకున్న సంఘటన ఇది. వివరాలు ఇలా ఉన్నాయి. సంతబొమ్మాలి మండలం, నౌపడ గ్రామంలో శ్రీ మంజునాథ డిపార్ట్మెంటల్ స్టోర్ యజమాని ద్విచక్ర వాహనంలో గురువారం రాత్రి నాగుపాము దూరి హల్ చల్ చేసింది. ఒకప్పుడు పాములు పుట్టలోనో, పొలాల్లో తోటల్లో కనిపించేవి. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఇళ్లలోనూ, వాహనాలల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు భయం పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలు పార్క్ చేసేవారు జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు కలిగి పరిస్థితులు ఉన్నాయని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో పాములు భయం పెరిగిపోయింది. బైక్ లో ఉండే రంధ్రాల్లో పాములు దూరి హల్చల్ చేస్తున్నాయి. అయితే స్థానికులు పామును అతి కష్టం మీద బయటకు తీసి హతమార్చారు. ఇదిలా ఉండగా గ్రామంలో గురువారం ఓ మహిళ పాము
కాటుతో మృతి చెందడంతో స్థానికులు మరింత భయాందోళనలకు గురి అవుతున్నారు.