బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడడంతో ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు చోట్ల వర్షాలు కురిశాయి. శుక్రవారం వర్షంతో ప్రజలకు ఇబ్బంది ఏర్పడ్డాయి. వేకువజాము నుండే వాతావరణం లో పెను మార్పులు చోటు చేసుకుని వర్షం కురవడంతో పాటు మరోవైపు ఎండలు కాస్తూ ఉండడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. మరోవైపు విద్యుత్ కోతలుతోఎంతో అవస్థలక గురవు తున్నారు. వర్షాలు సందర్భంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలుకు జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా రాకపోకలు సాగించేందుకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అలాగే విద్యుత్ కోత విధించడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. దీంతో రహదారులు జలమయమవుతుంది. ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో కురిసిన వర్షంతో ప్రజాజీవన వ్యవస్థ కుంటుపడుతుందని సామాన్య ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.