ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నాయి. ఇలాంటి సమయాల్లో డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెంగ్యూ రాకుండా జాగ్రత్తపడాలి. అధిక శరీర ఉష్ణోగ్రత, వాంతులు, విరేచనాలు, కంటి నొప్పి, మంట, తలనొప్పి, చర్మ సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, మలంలో రక్తం కారడం, కడుపునొప్పి, జలుబు, దగ్గు, నీరసం వంటి లక్షణాలు డెంగ్యూ లక్షణాలు. వెంటనే వైద్యులను సంప్రదించి మందులు వాడాలి.