గుంటూరు: వట్టి చెరుకూరు మండలం, కొర్నెపాడు గ్రామంలో వీధి కుక్కల దాడిలో బీహార్ కు చెందిన ఓ యువకుడి చేతి చూపుడు వేలు కొరకడంతో గాయమైంది. గురువారం స్థానిక మంచినీటి చెరువు నుండి నడిచి వెళ్తుండగా కుక్కలు దాడి చేశాయి. గ్రామంలో ప్రధాన రహదారి పొడవునా 30 నుంచి 40 వరకు కుక్కలు తిరుగుతూ స్థానికుల వెంట పడుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి.