దేశవాళీ టోర్నీలో పృథ్వీ షా అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. శుక్రవారం ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 మ్యాచ్‌లో అస్సాంపై సెంచరీ సాధించాడు. పృథ్వీ షా టీ20 కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. అంతకుముందు అతని ఖాతాలో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పృథ్వీ షా అత్యధిక స్కోరు 99 పరుగులు. 22 ఏళ్ల షా కేవలం 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అంటే 16 బౌండరీలు కొట్టాడు. చివరికి 61 బంతుల్లో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని మొత్తం ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఈ విధంగా మరోసారి తన బ్యాట్‌తో టీమిండియా, బీసీసీఐకి సమాధానమిచ్చాడు. పృథ్వీ షా దూకుడుతో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో అస్సాం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై మంచి ప్రదర్శన చేసింది. కానీ 7 బంతుల్లో 15 పరుగులు చేసిన తర్వాత అమన్ ఖాన్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. దీని తర్వాత పృథ్వీ షా, మరో యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ సెంచరీ భాగస్వామ్యంతో ముంబైని భారీ స్కోరు దిశగా నడిపించారు. ఆ తర్వాత 30 బంతుల్లో 42 పరుగులు చేసిన యశస్వి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చివర్లో సర్ఫరాజ్ ఖాన్ 15, శివమ్ దూబే 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.