యువత మత్తు పదార్థాలు బానిస అయితే భవిష్యత్తు నాశనం అవుతుందని పోలీస్ కానిస్టేబుల్ రాజేశ్వరి అన్నారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె స్థానిక శ్రీమునినారాయణ జూనియర్, డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థులకు మత్తుపదార్థాల వాడకంతో కలిగే అనర్థాల గురించి ఆమె అవగాహన కల్పించారు. గ్రామాల్లో మత్తుపదార్థాలు, మద్యానికి అలవాటు పడిన వ్యక్తుల్లో చైతన్యం తీసుకురావడానికి విద్యార్థులు కృషి చేయాలన్నారు. మత్తుపదార్థాల వాడకం అనిపిస్తే వెంటనే 14500, 100కు కాల్ చేయాలని సూచించారు.