విశాఖలో శనివారం జరుగుతున్న విశాఖ మహా గర్జనకు విజయవంతం చేయాలని వై. సి. పి. నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు పెందుర్తి నియోజక వర్గంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్, చోడవరం ఎమ్మెల్యే, అనకాపల్లి వై. సి. పి. ఇంచార్జ్ కారణం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ రాజధానిని తేవడానికి రాష్ట్ర ప్రజలంతా కృషి చేయాలని అన్నారు. విశాఖపట్నం హైదరాబాద్ కంటే విశాఖ మరింతగా అభివృద్ధి చెందుతుంది. దానికి రాజధానిగా రావాలి. టూరిజం, సాఫ్ట్వేర్ పరంగా, బిజినెస్ పరంగా విశాఖ అనువైన నగరం అని తెలిపారు. రాష్ట్రంలో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అమరావతితో పాటు విశాఖను రాజధానిగా చేయాలన్నదే వై. సి. పి. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందువలన రాష్ట్ర ప్రజలంతా విశాఖ ప్రజలంతా గర్జనకు మన ఉత్తరాంద్ర సత్తా చాటాలన్నారు నాయకులు.