ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదు ఆవరణలోని శివలింగానికి కార్బన్ డేటింగ్ పరీక్షను నిర్వహించాలని దాఖలైన హిందూ సంఘాల డిమాండ్‌ను వారణాసి జిల్లా కోర్టు తోసిపుచ్చింది. కౌన్సిల్ తరుపు న్యాయవాది ఈ విషయాన్ని వెల్లడించారు. నిర్మాణాన్ని యథాతథంగా భద్రపరచాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. రాయిపై కార్బన్ డేటింగ్ సాధ్యం కాదనే వాదనలను కోర్టు పరిగణించింది.