ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో గోవాలోని దూద్‌సాగర్ వాటర్‌ఫాల్స్ వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు వరద పెరగడంతో పర్యాటకులు దాటేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వంతెన కూలిపోయింది. దీంతో 40 మంది అక్కడ చిక్కుకుపోయారు. అధికారులు స్పందించి, వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణనష్టం ఏమీ జరగలేదని అధికారులు వెల్లడించారు.