తంబళ్లపల్లె మండల కేంద్రంలోని సీహెచ్సీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందిస్తామని కొత్తగా విధుల్లో చేరిన డాక్టర్లు తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కృషితో సీహెచ్సీలో ఇద్దరు కొత్త డాక్టర్లను నియమించారు. శుక్రవారం డాక్టర్ ఆశాలత రెడ్డి, డాక్టర్ వెంకట రామయ్య బాధ్యతలు చేపట్టారు. కొత్త డాక్టర్లు రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.