గుంటూరు: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నూరు రోడ్డులో ఓ ప్రాంతానికి చెందిన కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం నాడు తీవ్ర కలకలం రేపింది. మద్యానికి బానిసై టింకరింగ్ పనులు చేసుకునే ఆయనకు కుమారుడు(8), కుమార్తె (7) సంతానం ఉన్నారు. కొద్ది రోజులుగా కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. మరోసారి లైంగిక దాడికి పాల్పడుతుండగా చూసిన భార్య, వెంటనే కూతురుని తీసుకొని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.