మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో శనివారం విశాఖ గర్జన ర్యాలీ జరగనుంది. ఉదయం 9 గంటలకు నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. దీనికి అధికార పార్టీ వైసీపీ మద్దతు ప్రకటించింది. ఇదే రోజు టీడీపీ కూడా సదస్సు నిర్వహించడం, మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు రానుండడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఎక్కడికక్కడే భారీగా మోహరించారు.