భారీ వర్షాలకు పెన్నానదిపై శుక్రవారం వంతెన కూలిపోయింది. ఈ ఘటన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం పోచంపల్లిలో జరిగింది. ఈ ఘటనలో 12 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. హిందూపురం పట్టణంతో పాటు, పోచంపల్లి, బెవనహళ్లి పట్టణాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జికి వీలైనంత త్వరగా మరమ్మతులు నిర్వహించి, రాకపోకలు పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.