ఢిల్లీలోని ఘజియాబాద్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఇమ్రాన్, రుబీనాలకు 2017లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధించేవారు. ఇక కట్నంగా కారు ఇవ్వలేదని ఇటీవల ఫోన్లోనే భర్త తలాక్ చెప్పాడు. మరో మహిళతో పెళ్లికి సిద్ధమయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.