ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 101 స్థానం నుంచి 107 స్థానానికి పడిపోయింది. విచిత్రంగా పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల కంటే ఈ విషయంలో భారత్ వెనుకబడింది. చైనా, టర్కీ, కువైట్‌తో సహా 17 దేశాలు 5 కంటే తక్కువ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్‌తో టాప్ ర్యాంక్‌లో ఉన్నాయి. ఇక దీనిపై కాంగ్రెస్ ఎంపీ పి చిదంబరం స్పందించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని 8 ఏళ్ల పాలనలో 2014 నుండి స్కోరు దిగజారిందని అన్నారు.