రాష్ట్రంలోని 3 ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. విశాఖలో శనివారం నిర్వహించి గర్జన ర్యాలీలో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడన్నారు. ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ, జనసేనను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడారు.