ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ క్లస్టర్ ఇన్చార్జీలు, యూనిట్ ఇన్చార్జీలకు పార్టీ విధివిధానాలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. సమన్వయకర్త మాకినేని పెద్దరత్తయ్య మాట్లాడుతూ. నేటి మంత్రులు, స్పీకర్ వాడుతున్న భాష సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని దానికోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని సూచించారు.