రాయదుర్గం: స్థానిక కే. టీ. ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఏ. పీ. జే అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రఘురామ మూర్తి కలాం చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ , నేను అనే స్వార్థాన్ని విడనాడి, మనము, మన దేశం అనే భావన కలిగి ఉండాలని, ఎ. పి. జె. అబ్దుల్ కలామ్ వ్యక్తిత్వం ఇందుకు చక్కని నిదర్శనంఅని, భారతదేశం ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా అవతరించడంలో, రక్షణ రంగంలో ఆయన చేసినకృషి అభినందనీయమనీ తెలిపారు. దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి, ఆ పదవికే వన్నె తెచ్చి, ఉన్నత శిఖరాలకు చేరుకున్న అతని జీవితం విద్యార్థులకు స్ఫూర్తి దాయకం అని తెలిపారు.