కూడేరులో 2వరోజు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆనంత వెంకటరెడ్డి కాలనీలో నిర్వహించారు. కాలనీ వాసులు, వైస్సార్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను మాజీ ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.