శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద విషాద సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ముల్లపోదల్లో అప్పుడే పుట్టిన చిన్నారి మృతదేహం ప్లాస్టిక్ కవర్లో ఉంచి పొదల్లో పారవేశారు. కవర్ పై కర్ణాటక అడ్రస్సు ఉన్నట్లు గుర్తించారు. మృతి చెందిన చిన్నారిని అంగన్వాడీ, ఏ ఎన్ ఎం , ఆశా వర్కర్స్ లు, పోలీస్ లు పరిశీలించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన గోరంట్ల సీఐ సుబ్బరాయుడు పరిశీంచారు.