ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాడులపై పవన్ కళ్యాణ్ స్పందించాలి... మంత్రి అంబటి రాంబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 15, 2022, 08:54 PM

వైసీపీ నేతలపై జనసేన నేతలు చేసిన దాడి పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. ఇది ఇలా ఉంటే ఇవాళ విశాఖలో వైసీపీ గర్జన ఏర్పాటు చేయగా, అదే సమయంలో పవన్ కల్యాణ్ పర్యటనకు వస్తుండడం ఉద్రిక్తతలకు దారితీసింది. వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి వెళుతున్న మంత్రులు జోగి రమేశ్, రోజా, వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డిల వాహనాలపై జనసేన కార్యకర్తలు దాడి చేసినట్టు వైసీపీ ఆరోపిస్తోంది.


దీనిపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్ లపై విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జనసైనికులు దాడి చేశారంటూ ట్వీట్ చేశారు. ఈ దాడి ఘటనపై పవన్ కల్యాణ్ తక్షణమే సమాధానం చెప్పాలని నిలదీశారు. 


ఇది ఇలా ఉంటే దాడి ఘటనలో మంత్రి రోజా సహాయకుడికి కూడా గాయాలైనట్టు వైసీపీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా పంచుకుంది. మంత్రి జోగి రమేశ్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com