విశాఖ నగరంలో వైసీపీ చేపట్టిన రాజకీయ యాత్ర తుస్ మనడంతో ఆ ఉక్రోషం జనసేన నాయకులు, కార్యకర్తలపై చూపుతున్నట్టు తెలుస్తోందని లోకేశ్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ఇదిలావుంటే విశాఖ విమానాశ్రయంలో వైసీపీ మంత్రులు, నాయకులపై రాళ్ల దాడికి సంబంధించిన కేసులో గత అర్ధ రాత్రి పోలీసులు జనసేన నాయకులు కోన తాతారావు, పీతల మూర్తియాదవ్, విశ్వక్సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్‌రెడ్డి, పీవీఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, కీర్తీస్, యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజులను అరెస్ట్ చేశారు. విశాఖ విమానాశ్రయం వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు.