మీరు చేసుకోండి మూడు పెళ్లిళ్లు అంటూ తనను విమర్శించే నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం విశాఖ వచ్చిన పవన్... ఆదివారం ఉదయం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ నటన నేర్చుకోవడానికి విశాఖ కావాలి, పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇవ్వడానికి విశాఖ కావాలి...కాని రాజధానిగా మాత్రం విశాఖ వద్దా? అంటూ విశాఖ గర్జనలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు స్పందించిన పవన్ ఆసక్తికర కామెంట్లు చేశారు.
''నేను 3 పెళ్లిళ్లు చేసుకున్నానని వారు అసూయ పడుతున్నట్లున్నారు... వారినీ 3 పెళ్లిళ్లు చేసుకోమనండి. నాకేమీ అభ్యంతరం లేదు. నాకు కుదరలేకనే 3 పెళ్లిళ్లు చేసుకున్నాను. పొద్దాక తన పెళ్లిళ్లపై మాట్లాడే వారిని చూస్తుంటే... తాను 3 పెళ్లిళ్లు చేసుకున్నానని వారు అసూయ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. వారిని కూడా విడాకులు ఇచ్చి 3 పెళ్లిళ్లు చేసుకోమనండి. నాకేమీ ఇబ్బంది లేదు. అలాగైతే నేను 3 పెళ్లిళ్లు చేసుకున్న చోట 3 రాజధానులు పెడతారా? నేను ముంబైలో నటన నేర్చుకున్నాను. మరి అక్కడ రాజధాని పెడతారా?'' అంటూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.