ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంఆర్ఎన్ఏ టీకాతో ఆ వయస్సులో వారికి రిస్క్ ఎక్కువటా

international |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 01:30 AM

కరోనా టీకాల విషయంలో నేటికీ మనందరికీ ఎన్నో అపోహలున్నాయి. వాటిని రుజువుచేస్తూ ఇటీవల పలు పరిశోధనల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇదిలావుంటే కరోనా నివారణకు ఇస్తున్న ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారిత టీకాలతో గుండె సమస్యలు ఏర్పడి మరణాల రిస్క్ పెరిగిపోతున్నట్టు ఫ్లోరిడాకు చెందిన సర్జన్ జనరల్ డాక్టర్ జోసెఫ్  లాడపో తెలిపారు. ముఖ్యంగా 18-39 సంవత్సరాల్లోపు వారికి రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్టు చెప్పారు. కనుక గుండె జబ్బులున్నవారు ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకా తీసుకునే ముందు వైద్యుల సూచన తీసుకోవాలని సూచించారు.


‘‘కోవిడ్-19 ఎంఆర్ఎన్ఏ టీకాలకు సంబంధించి విశ్లేషణను విడుదల చేశాం. వాటిపట్ల అవగాహన ఉండాలి. ఈ అధ్యయనంలో భాగంగానే 18-39 ఏళ్ల వారికి అధిక రిస్క్ ఉంటున్నట్టు వెల్లడైంది. ఎంఆర్ఎన్ఏ టీకా తీసుకున్న 28 రోజుల్లోపు గుండె సంబంధిత మరణం చోటు చేసుకుంటోంది’’ అని వివరించారు. ముఖ్యంగా అప్పటికే గుండె జబ్బులు ఉన్న వారికి ఈ టీకా ప్రాణాంతకమవుతోంది. మయోకార్డైటిస్, పెరికార్డైటిస్ కు దారితీస్తోంది. మన దేశంలో ఎంఆర్ఎన్ఏ తాలూకూ తొలి వ్యాక్సిన్ జెమ్ కోవాక్-19 త్వరలోనే అందుబాటులోకి రానుంది. కోవిషీల్డ్ వైరల్ వెక్టార్ ఆధారితం. కోవాగ్జిన్ అన్నది ఇన్ యాక్టివేటెడ్ వైరల్ వ్యాక్సిన్.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com