కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కాకినాడ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి దేవస్థానం కార్యనిర్వహణధికారి రాణా ప్రతాప్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి , స్వామి వారి దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను మరియు చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపర్డెంట్ కోదండపాణి, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.