రాష్ట్రంలో గంజా అక్రమాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పాలి . తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా, వై.రామవరం మండలంలో ఆదివారం గంజాయి అక్రమ రవా ణా చేస్తున్న వారిపై దాడిచేసి 12 మందిని అరెస్ట్ చేసినట్లు అడ్డతీగల సీఐ వై.రాంబాబు తెలిపారు. మండలంలోని బండిగడ్డ కాలువ సమీపంలో పలకజీడి, జంగాలతోట గ్రామాల మీదుగా ద్విచక్రవాహనాలపై గంజాయిని తరలిస్తుండగా తమకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ సంతోష్‌కుమార్ సిబ్బందితో దాడిచేసినట్లు తెలిపారు. వారివద్ద నుంచి రూ.80 వేల విలువచేసే 40 కేజీల గంజాయిని, 4 బైకులను, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన 12మందిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్న ట్లు సీఐ తెలిపారు. హైదరాబాద్, వై.రామవరం, అడ్డతీగల, ఏలేశ్వరం మండలాలకు చెందిన కమ్మం లక్ష్మయ్యదొర, సలివెడి అబ్బాయి, బాకూరి విశ్వనాధం, కన్నోజి రాజబాబు, పచ్చల రవీంద్రరెడ్డి, జర్తా వెంకటరమణ, నైయిని కృష్ణారెడ్డి, కయ్యం వెంకటేశ్వరులు, బిక్కివిల్లి వీరబాబు, పాలబిందెల నరసింగరావు,(హైదరాబాద్), కడబాల సురేష్లను అరెస్ట్‌చేసి వారిని సోమవారం కోర్టులో ప్రవేశపెడతామని సీఐ తెలిపారు.