ఇటీ వల లోన్‌యాప్‌ల పేరుతో కృష్ణ జిల్లా లో ఒక యువ కుడిని మోసం చేసి లక్షలు కాజేసిన ఉదంతం మరు వక ముందే పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో మరో యువ కుడికి గాలం వేసి రూ.2 లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు విస్సన్న పేటకు చెందిన చెరుకు జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబరు మొదటి వారంలో పార్ట్‌టైమ్ జాబ్ కోసం పలు పేర్లతో ఉన్న వెబ్‌సైట్లను సెర్చ్ చేయగా..ఓ లింక్ ఓపెన్ చేసి అందులో నిర్వాహకులతో చాటింగ్ చేయడం జగదీష్ ప్రారంభించాడు. వారు ఆన్‌లైన్‌లో పలు వస్తువులు చూపి కొనుగోలు చేసి, వ్యాపారంలా చేస్తే పెద్ద మొత్తంలో కమీషన్ వస్తుందని ఆశచూపారు. దానిని ఓపార్ట్‌టైమ్ జాబ్‌గా చేసుకుని లక్షలు సంపా దించవచ్చని నమ్మబలికారు. కమీషన్ వస్తుందని నమ్మి రూ.100 నుంచి పలు దఫాలుగా బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.2,03,000ను ఫోన్‌పే రూపంలో కేటుగాళ్ల అకౌంట్లలోకి జమ చేశాడు. అయినా డబ్బుల కోసం వేధిస్తున్న కేటుగాళ్లు రూ.70 వేలు చెల్లిస్తే తన అకౌంట్‌లో కమీషన్ జమ చేస్తామని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నకిలీ వెబ్‌సైట్లు, లింక్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.