పొద్దుటూరు స్థానిక 14 వ వార్డులో ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పర్యటించారు. వార్డు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ షేక్ జిలాన్, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు మారుతి ప్రసాద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ కుమార్ రెడ్డి, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్రమ్ గౌస్, కార్పొరేషన్ డైరెక్టర్ లు ఉమామహేశ్వరి, రజినీ, వైస్సార్సీపీ మహిళ నాయకురాల్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు వార్డు వైఎస్ఆర్ సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.