మంత్రాలయం: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 18న కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గంలోకి ప్రవేసించనుంది. హాలహర్వి మండలం క్షేత్రగుడి వద్ద రాహుల్ పాదయాత్ర ద్వారా అడుగు పెట్టనున్నారు. అదే రోజు ఉదయం 6: 30 గంటల నుండి సాయంత్రం 7: 30 వరకు ఆలూరు మండలం మణేకుర్తి వరకు సాగుతుంది. 19న ఉదయం 6: 30 గంటల నుండి 10: 30 గంటలకు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం అక్కడి నుండి సాయంత్రం 7: 30 గంటలకు ఆరేకల్ చేరుకుంటారు.