శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిలకపాడు గ్రామానికి చెందిన బడా నేత తమ పొలంతోపాటు దారిని కూడా ఆక్రమించుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని శ్రీనివాసులు అనే వ్యక్తి ఆరోపించారు. దారి ఆక్రమణకు గురికావటంతో పశువులు మేతకు వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా ఉందని తెలిపారు. పొలాలకు వెళ్లే దారి సమస్యను పరిష్కరించండి’ అని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిని వేడుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, మ్యాప్ ప్రకారం ప్లాన్‌లో ఉన్న దారిని వారికి వదిలేయాలని పక్కనే ఉన్న ఆ బడా నేతకు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తదుపరి చిలకపాడులోని అధికారులతో సమస్యలపై సమీక్షించారు.