అనంతపురం జిల్లాలో , వరదలతో సర్వం కోల్పోయి, బాధితులు గగ్గోలు పెడుతుంటే రూ.2వేలు ఆర్థికసాయం చేయడం ఏందయ్యా?’ అంటూ సీఎం జగన్‌ను చంద్రదండు వ్యవస్థాపకుడు, రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకా్‌షనాయుడు ప్రశ్నించారు. ఆదివారం అనంతపురం నగరంలో ముంపు బారిన పడిన యువజన కాలనీ, రంగస్వామి నగర్, రజక నగర్, సోమనాథ్ నగర్ తదితర ప్రాంతాల్లో నల్లజెండాలు చేతపట్టుకుని, తప్పెట్లు కొట్టుకుంటూ దండోరా వేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ.. వరదలతో వేలాది కుటుంబాలకు చెందిన నిత్యావసర సరుకులు, దుస్తులు, టీవీలు, ఫ్రిజ్‌లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు నీటిలో తడిసి చెడిపోయి తీవ్రంగా నష్టపోయారన్నారు. ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యగా కేవలం రూ.2వేలు ఆర్థిక సాయం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాస్తవ పరిస్థితులను గుర్తించి, ఒక్కో కుటుంబానికి రూ.30 వేలు తక్షణం ఇప్పించాలని కోరారు.