U.A.E లోని రాస్ అల్ ఖైమాలో శ్రీకాకుళం వాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా గోకనపురానికి చెందిన బేసి తిరుపతిరావు (31) కొన్నేళ్లుగా రాస్ అల్ ఖైమా నౌకశ్రాయంలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.