ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌రెడ్డి ముఠా దోపిడీపై వచ్చే ప్రజాసునామీని ఆపలేవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 11:27 AM

రాష్ట్రంలో ఎన్నికల వేళా వస్తున్నా తరుణంలో, వైసీపీ పార్టీ  విశాఖపై మొసలి కన్నీరు కారిస్తే మోసపోవటానికి ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులేమీ కాదని గర్జన షో ఫ్లాప్‌తో నిరూపితమైందని టీడీపీ నాయకులూ  చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అధికార దుర్వినియోగం చేసే కబ్జాకోరుల గర్జనపై వరుణ దేవుడు కూడా నీళ్లు చల్లాడని ఎద్దేవా చేశారు. ‘‘మూడు రాజధానుల ఏర్పాటుకు అధికారం జగన్‌రెడ్డికి లేదని కోర్టులు స్పష్టం చేసినా, ఉత్తరాంధ్రను దోచుకోవటానికే మూడు ముక్కలాటతో ప్రాంతీయ, కుల చిచ్చు పెడుతున్నారు. కబ్జాకోరుల గర్జనకు విజయసాయిరెడ్డి ఎందుకు ముఖం చాటేశారు. కపట నాటకాలు, కృత్రిమ ఉద్యమాలు, బలవంతపు జనసమీకరణలు.. జగన్‌రెడ్డి ముఠా దోపిడీపై వచ్చే ప్రజాసునామీని ఆపలేవు’’ అని అయ్యన్న హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com