తిరుపతి రైల్వేస్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కిందున్న హైటెన్షన్ విద్యుత్ లైన్‌పై దూకి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరుపతి రైల్వేస్టేషన్లో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.. ఓ యువకుడు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఫెన్సింగ్‌ను దాటుకుని కింద ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్‌పైకి దూకాడు. దాంతో విద్యుదాఘాతానికి గురై రెండో నంబరు ప్లాట్‌ఫారంపై ఉన్న రైలుపై పడ్డాడు. తర్వాత ప్లాట్‌ఫారంపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుని వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుంది. ఈ నెల 15వ తేదీన విల్లుపురం నుంచి తిరుపతికి ప్రయాణించిన రైల్వే టికెట్ తప్ప ఇంకేమీ ఆధారాలు లభించలేదు. ఆచూకీ తెలిసినవారు 9440627638, 9966182180 నెంబర్లకు ఫోన్ చేయాలని తిరుపతి రైల్వే సీఐ హేమసుందర్రావు, ఎస్ఐ బలరామ్ విజ్ఞప్తి చేశారు.