శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం అధికారులు ప్రాజెక్ట్ 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1, 66, 599 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2, 53, 260 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.