డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడు సమక్షంలో సోమవారం టిడిపి నుండి వైసీపీలోకి భారీ చేరికలు జరిగాయి. చీడికాడ మండలం అర్జునగిరి గ్రామానికి చెందిన 50మంది తెలుగుదేశం నాయకులు వైసీపీ పార్టీ కండువాలు కప్పుకున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలు, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదర్శాలు తమని ప్రభావితం చేశాయని, బూడి ముత్యాల నాయుడు నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని నూతనంగా పార్టీలో చేరిన వారు అన్నారు. పంచాయతీ బోర్డు సభ్యులు కాళ్ళ మంగా, అచ్చిబాబు, పెద్దింటి రాము నాయుడు, డోకల రాయుడు, పెద్దింటి మహాలక్ష్మి నాయుడు, టి. దేముడు, హేమల మహాలక్ష్మి నాయుడు తదితరులు డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం తారువ లో ఉపముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముత్యాల నాయుడు చీడికాడ మండలంలో వైయస్సార్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ వారిని అభినందించారు.