గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికపై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM) ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక ప్రచురకణకర్తలు భారతదేశం పరువు తీసేలా వ్యవహరించారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడింది. లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 121 దేశాలలో భారతదేశం 107వ స్థానం ఇవ్వడం వాస్తవానికి దూరంగా ఉందని పేర్కొంది. ప్రచురణకర్తలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.